32 కోట్ల మొక్కలు నాటుతాం: ఇంద్రకరణ్‌రెడ్డి
ABN , First Publish Date - 2020-06-25T21:19:51+05:30 IST
మెదక్ : నర్సాపూర్‌లో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు

మెదక్ : నర్సాపూర్‌లో ఆరవ విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. అడవుల పునరుద్ధరణ ఎలా చేయాలో సీఎం చెప్పారన్నారు. తెలంగాణలో ఐదు విడుతల్లో 180 కోట్ల మొక్కలు నాటామన్నారు. ఈసారి 32 కోట్లు మొక్కలు నాటుతామన్నారు. 12,800 జీపీలకు ట్రాక్టర్లు కొన్నామని.. వీటి ద్వారా చెట్లకు నీళ్లు పోస్తామన్నారు. 24 శాతం ఉన్న అడవులను 33 శాతానికి తెస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొక్కల పెంపకంలో కూడా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. నర్సాపూర్ అర్బన్ పార్క్‌లో పిల్లలు, పెద్దలకు ఆటవిడుపు కల్పిస్తున్నామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.