ఇందూరు అమ్మాయి.. అమెరికా అబ్బాయి..

ABN , First Publish Date - 2020-03-13T10:53:36+05:30 IST

అమెరికాలో మొదలైన వారి ప్రేమ ఖండాంతరాలను దాటి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. నిజామాబాద్‌కు చెందిన సోమేశ్వర్‌, వరలక్ష్మిల కూతురు అర్చన ఉన్నత

ఇందూరు అమ్మాయి.. అమెరికా అబ్బాయి..

నిజామాబాద్‌ అర్బన్‌, మార్చి 12: అమెరికాలో మొదలైన వారి ప్రేమ ఖండాంతరాలను దాటి భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం మూడుముళ్ల బంధంతో ఒక్కటైంది. నిజామాబాద్‌కు చెందిన సోమేశ్వర్‌, వరలక్ష్మిల కూతురు అర్చన ఉన్నత చదువుల కోసం 2010లో అమెరికా వెళ్లింది. అక్కడ ఉద్యోగం చేస్తున్న క్రమంలో శాన్‌ పరిచయమయ్యాడు. అనంతరం అది ప్రేమగా మారింది. శాన్‌ తల్లిదండ్రులు అర్చన తల్లిదండ్రులతో మాట్లాడి వివాహానికి ఒప్పించారు. ఈ క్రమంలో గత యేడాది మే 15న అమెరికాలో అర్చన, శాన్‌ రిజిస్టర్‌ మ్యారేజీ చేసుకోగా.. గురువారం నిజామాబాద్‌లో బంధుమిత్రుల సమక్షంలో వివాహం జరిపించారు. 

Updated Date - 2020-03-13T10:53:36+05:30 IST