పోలీస్‌ కార్యాలయాల్లో పతాకాల ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-08-16T10:27:37+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పోలీస్‌ కార్యాలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు. సర్దార్‌ వల్లభాయ్‌ ..

పోలీస్‌ కార్యాలయాల్లో పతాకాల ఆవిష్కరణ

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర దినోత్సవాన్ని పోలీస్‌ కార్యాలయాల్లో శనివారం ఘనంగా నిర్వహించారు.  సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జాతీయ పోలీస్‌ శిక్షణ కేంద్రం (ఎన్పీఏ)లో డైరెక్టర్‌ అతుల్‌ కర్వాల్‌ త్రివర్ణ పతాకం ఆవిష్కరించారు. డీజీపీ కార్యాలయంలో అదనపు డీజీపీ రాజీవ్‌ రతన్‌, అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయంలో ఏసీబీ డీజీ డా.జె.పూర్ణచంద్రరావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఎన్‌ఎ్‌ఫసీ, సీఐఎ్‌సఎఫ్‌, ఏఈసీ స్కూల్స్‌ సంయుక్తంగా నిర్వహించిన వేడుకలకు ఎన్‌ఎ్‌ఫసీ చైర్మన్‌  -చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ డా.దినేష్‌ శ్రీవాత్సవ హాజరై జెండా ఎగురవేశారు. 

Updated Date - 2020-08-16T10:27:37+05:30 IST