77189 55555 ఇండేన్ గ్యాస్ బుకింగ్‌కు దేశవ్యాప్తంగా నేటి నుంచి ఒకే నంబరు
ABN , First Publish Date - 2020-11-01T07:01:49+05:30 IST
దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుకింగ్ చేసుకునేందుకు 24 గంటలూ పనిచేసేలా..
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా ఉన్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులు సిలిండర్ బుకింగ్ చేసుకునేందుకు 24 గంటలూ పనిచేసేలా ఇండియన్ ఆయిల్ సంస్థ ఒకే నంబరును ప్రవేశపెట్టింది. ఆదివారం నుంచి 77189 55555 నంబరుకు సంక్షిప్త సమాచారాన్ని చేరవేయడం ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఒక టెలికాం సర్కిల్ నుంచి మరొక రాష్ట్ర పరిధిలోని సర్కిల్‌కు మారినప్పటికీ ఇదే నంబరును వాడుకోవచ్చు.
నేటి నుంచి ఓటీపీతో సిలిండర్ డెలివరీ
గృహ అవసరాలకు వినియోగించే ఎల్‌పీజీ సిలిండర్ల డెలివరీ సమయంలో వినియోగదారులు మొబైల్‌కు వచ్చిన ఓటీపీ (వన్‌టైమ్ పాస్‌వర్డ్) చెప్పాల్సి ఉంటుంది. ఆదివారం నుంచి 100 స్మార్ట్ సిటీల్లో ఇది అమల్లోకి రానుంది.