కరోనాపై పోరు... కొవ్వొత్తులు వెలిగించిన జగన్,కేసీఆర్, చంద్రబాబు

ABN , First Publish Date - 2020-04-06T02:59:46+05:30 IST

కరోనాపై పోరు... కొవ్వొత్తులు వెలిగించిన జగన్,కేసీఆర్, చంద్రబాబు

కరోనాపై పోరు... కొవ్వొత్తులు వెలిగించిన జగన్,కేసీఆర్, చంద్రబాబు

హైదరాబాద్: కరోనా వైరస్‌పై పోరు.. ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్, మాజీ సీఎం చంద్రబాబునాయుడు కొవ్వొత్తులు వెలిగించారు. ప్రగతిభవన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొవ్వొత్తి వెలిగించారు. గుంటూరు తాడేపల్లిలోని తన నివాసంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కొవ్వొత్తి వెలిగించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి లోకేష్‌ కొవ్వొత్తులు వెలిగించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రజలు పెద్ద ఎత్తున కొవ్వొత్తులు వెలిగించారు. కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్లలో దీపాలు వెలిగించారు.

Updated Date - 2020-04-06T02:59:46+05:30 IST