హైదరాబాద్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-05-17T17:32:15+05:30 IST

కేంద్రం గుర్తించిన 30 ప్రాంతాలలో గ్రేటర్ హైదరాబాద్ కూడా ఉంది.

హైదరాబాద్‌లో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్: కేంద్రం గుర్తించిన 30 ప్రాంతాలలో గ్రేటర్ హైదరాబాద్ కూడా ఉంది. నగరంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతుండటమే ఇందుకు కారణం. దీంతో లాక్ డౌన్ నిబంధనలను హైదరాబాద్‌లో మరింత పటిష్టంగా అమలు చేయనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రంగాలు సడలింపులు ఇవ్వడంతో ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఇళ్లల్లో బర్త్‌డే, ఇతర కార్యక్రమాలకు హాజరవుతున్నారు. దీంతో ఒక్కో కుటుంబంలో 10 నుంచి 20 వరకు కేసులు నమోదవుతుండడంతో పోలీసులు ఆందోళన చెందుతున్నారు.


కాగా కేంద్రం ప్రకటించిన లాక్ డౌన్ ఆదివారంతో ముగియనుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం ఈనెల 29 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు నుంచి రోడ్లపైకి వచ్చిన ప్రజల పట్ల మరింత కఠినంగా వ్యవహరించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పూర్తిగా రాకపోకలు నిషేధమని చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాలు, సాఫ్ట్ వేర్ కంపెనీలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉంచాలని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2020-05-17T17:32:15+05:30 IST