రాష్ట్రంలో పెరిగిన పరీక్షలు
ABN , First Publish Date - 2020-12-05T08:47:04+05:30 IST
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచింది. గురువారం 57,405
గురువారం 57వేలపైగా టెస్టులు
మరో 631మందికి వైరస్; ఇద్దరు మృతి
హైదరాబాద్, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచింది. గురువారం 57,405 మందికి టెస్టులు చేశారు. కొత్తగా 631 మందికి వైరస్ నిర్ధారణ అయింది. కరోనాతో తాజాగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,72,123కు, మరణాలు 1,467కు పెరిగాయి. 802మంది కోలుకున్నారు.
మొత్తం రికవరీలు 2,61,830 అయ్యాయి. 8,826 యాక్టివ్ కేసులున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 729 మంది, ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,280 మంది చిక్సిత పొందుతున్నారు. కొత్త కేసుల్లో 109 గ్రేటర్ హైదరాబాద్‌లో నమోదవగా, మేడ్చల్‌లో 57, రంగారెడ్డి జిల్లాలో 49, కరీంనగర్‌లో 34 మందికి పాజిటివ్ అని తేలింది.