పెరిగిన చలి గాలులు

ABN , First Publish Date - 2020-12-28T08:21:36+05:30 IST

ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది

పెరిగిన చలి గాలులు

హైదరాబాద్‌/సిటీ/ఆసిఫాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది. ఆదివారం కుమ్రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా గిన్నెధరిలో 6.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. తిర్యాణి, అర్లి(టి)లో 7.1, వాకిండి 7.2, బేల 7.4, సిర్పూర్‌(యు)8.3, కెరమెరి 8.8, రామగుండం 11.6, మెదక్‌ 11.9, హకీంపేట 13.8, హన్మకొండ 14, నిజామాబాద్‌లో 14.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో 14.5 డిగ్రీల కనిష్ఠ, 31 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

Updated Date - 2020-12-28T08:21:36+05:30 IST