అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధర పెంపు

ABN , First Publish Date - 2020-05-08T10:24:42+05:30 IST

గిరిజనుల నుంచి కొనుగోలు చేసే వివిధ రకాల ఉత్పత్తుల కొనుగోలు ధరలను కేంద్ర ప్రభుత్వ సూచనల

అటవీ ఉత్పత్తుల కొనుగోలు ధర పెంపు

హైదరాబాద్‌, మే 7(ఆంధ్రజ్యోతి): గిరిజనుల నుంచి కొనుగోలు చేసే వివిధ రకాల ఉత్పత్తుల కొనుగోలు ధరలను కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు గిరిజన సహకార కార్పొరేషన్‌ పెంచింది. ఈ మేరకు కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ క్రిస్టియానా గురువారం ఆదేశాలు జారీ చేశారు. అడవి తేనె కిలో ధర ఇప్పటివరకు రూ.195 ఉండగా దీనిని రూ.225కి పెంచారు. అలాగే, విప్ప పువ్వు కిలో రూ. 17 నుంచి రూ.30, బంక రూ.108 నుంచి రూ.114, విప్ప గింజలు రూ. 25 నుంచి రూ.29, ఎండిన ఉసిరి రూ.45 నుంచి రూ.52, కుంకుడు రూ.8 నుంచి రూ.14కు పెంచారు.

Updated Date - 2020-05-08T10:24:42+05:30 IST