ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి పెంపు
ABN , First Publish Date - 2020-10-21T09:31:37+05:30 IST
ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని భారత ఎన్నికల కమిషన్ పెంచింది.

హైదరాబాద్, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి):ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీచేసే అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని భారత ఎన్నికల కమిషన్ పెంచింది. రాష్ట్రాల వారీగా పరిమితులను ప్రకటించింది. తెలంగాణ, ఏపీల్లో.. ఎమ్మెల్యే అభ్యర్థి గరిష్టంగా రూ.30,80,000, ఎంపీ అభ్యర్థి 77లక్షలకు మించి ఖర్చు చేయకూడదని పేర్కొంది.