టమాటా ధరలకు రెక్కలు-నేల చూపు చూస్తున్న ఉల్లి

ABN , First Publish Date - 2020-07-20T20:30:21+05:30 IST

ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయల ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యవ వినియోగించే టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండగా ఉల్లిఽగడ్డ మాత్రం కొనేవారు లేక వెలవెలబోతున్నాయి.

టమాటా ధరలకు రెక్కలు-నేల చూపు చూస్తున్న ఉల్లి

హైదరాబాద్‌: ప్రస్తుతం రాష్ట్రంలో కూరగాయల ధరలు సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నిత్యవ వినియోగించే టమాటా ధరలు ఆకాశాన్నంటుతుండగా ఉల్లిఽగడ్డ మాత్రం కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. నిజానికి నిత్యజీవితంలో సామాన్యులకే అన్ని వర్గాలకూ తప్పని సరిగా అవసరం. తెలంగాణ రాష్ట్రంలో టమాటా దిగుబడి తగ్గిపోయింది. పక్కరాష్ర్టాల నుంచి వచ్చేఉత్పత్తులు తగ్గాయి. దీంతో రాష్ట్రంలో టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. లాక్‌డౌన్‌ సమయంలోనూ కిలో 10 రూపాయలకే లభించిన టమాటా ప్రస్తుతం 50 నుంచి 60 రూపాయలు పలుకుతోంది. ఇదేంటి ఇంతగా ధరలుపెరిగిపోయిన్‌ అని వినియోగ దారులు బెంబేలెత్తిపోతున్నారు. కానీ తెలంగాణలో పంటే టమాటా గత సంవత్సరం ఇదే సీజన్‌లో హైదరాబాద్‌ మార్కెట్‌కు రోజుకు 120 నుంచి 130 లారీలు తరలి రాగా ప్రస్తుంత 50 నుంచి 60లారీలకు పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. 


గత సంవత్సరం జూలైమాసంలో కిలో టమాటా రిటైల్‌ మార్కెట్‌లో 20 నుంచి 30రూపాయలు పలికింది. కానీ ప్రస్తుతం 50 నుంచి 60రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్‌ నగ రానికి తెలంగాణలోని సిద్దిపేట, మెదక్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌ నగర్‌ తదితర ప్రాంతాల నుంచే కాకుండా కర్నాటక, ఏపీ రాష్ర్టాల నుంచి కూడా దిగుమతి అవుతుంది. కానీ ప్రస్తుతం టమాటా దిగుబడులు తగ్గడంతోపాటు, కరోనా కారణంగానే చాలా రైతులు హైదరాబాద్‌కు టమాటా తరలించేందుకు భయపడుతున్నారు. దీంతో దిగుమతులు బాగా తగ్గాయి. ఇదే అదనుగా వ్యాపారులు ధరలు పెంచి అమ్ముతున్నారు. 


ఇక ఉల్లిగడ్డ విషయానికి వస్తే గత సంవత్సరం ఇదే సమయంలో కిలో ఉల్లిగడ్డ 30 నుంచి 40 రూపాయలు పలికింది. కానీ ప్రస్తుతం 10 రూపాయలకు పడిపోయింది. ఈసారి తెలంగాణ రాష్ట్రంలోనూ ఉల్లిగడ్డ భారీగా పండడంతో పాటు, మహారాష్ట్ర, ఏపీ నుంచి దిగుమతులు కూడా బాగా పెరిగినట్టు వ్యాపారులు చెబుతున్నారు. దీంతో ఉల్లిధరలు రోజు రోజుకూ మరింత పడిపోతున్నాయని అంటున్నారు. వారం రోజుల క్రితం వరకూ 100 రూపాయలకు 5 నుంచి 6  కేజీలు అమ్మకాలు జరిపారు. తాజాగా కిలో 10 రూపాయలకే విక్రయిస్తున్నారు. ఉల్లిధరలు భారీగా పడిపోవడంతో వాటిని పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాపారులు తెలిపారు. 

Updated Date - 2020-07-20T20:30:21+05:30 IST