బొగ్గు ఉత్పత్తి పెంచండి

ABN , First Publish Date - 2020-12-05T08:29:27+05:30 IST

బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ నుంచి ఉత్పతిని పెంచాలని సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆదేశించారు. అన్ని ఏరియాల

బొగ్గు ఉత్పత్తి పెంచండి

రోజుకు 1.85 లక్షల టన్నుల రవాణా చేయాలి

జీఎంలకు సింగరేణి సీఎండీ శ్రీధర్‌ ఆదేశం 

హైదరాబాద్‌/కొత్తగూడెం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో డిసెంబర్‌ నుంచి ఉత్పతిని పెంచాలని సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ ఆదేశించారు. అన్ని ఏరియాల జనరల్‌ మేనేజర్లతో సింగరేణి భవన్‌ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రోజుకు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయడంతో పాటు 1.85 లక్షల టన్నులు రవాణా చేయాలన్నారు. 13.5లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డన్‌ తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నవంబరులో రోజుకు 29 ర్యాకుల ద్వారా బొగ్గు రవాణా జరిగిందని, డిసెంబరు నుంచి 35 ర్యాకుల ద్వారా రవాణా చేయాలన్నారు.


ఆర్‌కేపీ ఓపెన్‌ కాస్ట్‌, శ్రీరాంపూర్‌ ఓపెన్‌ కాస్ట్‌, కేటీకే ఓపెన్‌ కాస్ట్‌, రామగుండం-3 ఓపెన్‌ కాస్ట్‌ గనులకు సంబంధించిన ఓవర్‌ బర్డెన్‌ తొలగింపు కాంట్రాక్ట్‌ను ఖరారు చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, జేవీఆర్‌ ఓపెన్‌ కాస్ట్‌కి సంబంధించి 38 లక్షల క్యూబిక్‌ మీటర్ల కొత్త కాంట్రాక్ట్‌ నియామకానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 


Updated Date - 2020-12-05T08:29:27+05:30 IST