చేతకాని అసమర్థ సీఎం కేసీఆర్‌: బండి సంజయ్‌

ABN , First Publish Date - 2020-09-04T01:25:39+05:30 IST

చేతకాని అసమర్థ సీఎం కేసీఆర్‌ అంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. కరోనా బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు.

చేతకాని అసమర్థ సీఎం కేసీఆర్‌: బండి సంజయ్‌

భద్రాద్రి: చేతకాని అసమర్థ సీఎం కేసీఆర్‌ అంటూ బీజేపీ నేత బండి సంజయ్‌ నిప్పులు చెరిగారు. కరోనా బాధితుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. భాగ్యనగరాన్ని కోవిడ్‌ సిటీగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని చెప్పారు. కోవిడ్ నియంత్రణకు కేంద్రం తెలంగాణకు రూ.7 వేల కోట్లు ఇచ్చిందని, కేంద్రం సూచనలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని తప్పుబట్టారు. కోవిడ్ కారణంగా ఇప్పటి వరకు 10 మంది కార్యకర్తల్ని కోల్పోయామని సంజయ్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-04T01:25:39+05:30 IST