మల్లన్న స్వామికి సుధావళి వర్ణలేపనం

ABN , First Publish Date - 2020-12-11T05:09:38+05:30 IST

మల్లన్న స్వామికి సుధావళి వర్ణలేపనం

మల్లన్న స్వామికి సుధావళి వర్ణలేపనం

నేటి నుంచి స్వామివారి దర్శనం, ఆర్జిత సేవల నిలిపివేత

ఐనవోలు, డిసెంబరు 10: ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని గురువారం నుంచి మంగళవారం వరకు స్వామి వారికి సుధావలి వర్ణలేపనం( రంగులతో  అలంకరణ) కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో  గురువారం నుంచి ధను సంక్రమణం ప్రారంభమవుతున్నందున ఈ నెల 10న మధ్యాహ్నం నుంచి 15 మంగళవారం వరకు స్వామి వారి నిజరూప దర్శనం, అర్జిత సేవలు నిలిపివేయనున్నట్టుఈవో అద్దంకి నాగేశ్వర్‌రావు తెలిపారు. అభిషేకాలు, అర్చనలు, కల్యాణం పూజ కార్యక్రమాలు ఉండవని, ఆలయానికి వచ్చే భక్తులు ముఖ మండపంలోని ఉత్సవ విగ్రహాల దర్శనం చేసుకోవచ్చని తెలిపారు. 16న బుధవారం స్వామి వారికి నిర్వహించే దృష్ఠి కుంభం తదుపరి  స్వామి వారి పునర్‌ దర్శనం, గణపతి పూజ, పుణ్యాహవచనంఅనంతరం ఆర్జిత సేవలు యథావిధిగా  కొనసాగుతాయని ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పాతర్లపాటి రవీందర్‌ తెలిపారు. భక్తులు గమనించాలని కోరారు.

Updated Date - 2020-12-11T05:09:38+05:30 IST