జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో..
ABN , First Publish Date - 2020-11-13T09:14:04+05:30 IST
జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని అభ్యర్థిస్తూ నగరానికి చెందిన శ్రీధర్ బాబు, మహమ్మద్ తాహెర్..
ఇద్దరు పిల్లల నిబంధనపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించాలని అభ్యర్థిస్తూ నగరానికి చెందిన శ్రీధర్ బాబు, మహమ్మద్ తాహెర్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిని విచారించిన ధర్మాసనం.. ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపురి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది.
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన మునిసిపల్ చట్టంలో.. రాష్ట్రంలోని మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్‌ల పరిధిలో ఈ నిబంధనను తొలగించినట్లు కోర్టుకు పిటిషనర్ తెలిపారు. జీహె చ్‌ఎంసీ ఎన్నికలకు వర్తింపజేయడం అన్యాయమని, సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకమని వివరించారు.