2023లో అధికారం మనదే
ABN , First Publish Date - 2020-12-06T07:26:13+05:30 IST
గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు.

గ్రేటర్ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిపై చర్యలు తప్పవని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హెచ్చరించారు. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా సమన్వయకర్తలకు సూచించారు. శనివారం పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీతో పాటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.
మరోవైపు.. పార్టీ తరపున గెలిచిన కార్పొరేటర్లతో సంజయ్ భేటీ అయ్యారు. 2023లో అధికారంలోకి వస్తున్నామని, ప్రజల మధ్యలో ఉంటూ సమస్యలను పరిష్కరించాలన్నారు.