నంబర్ ప్లేటు మార్చితే.. సీపీ సీరియస్ వార్నింగ్

ABN , First Publish Date - 2020-03-12T18:13:29+05:30 IST

వాహనాల నంబర్‌ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చే వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

నంబర్ ప్లేటు మార్చితే..  సీపీ సీరియస్ వార్నింగ్

హైదరాబాద్: వాహనాల నంబర్‌ ప్లేట్లను ఉద్దేశపూర్వకంగా మార్చే వాహనదారులకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నంబర్ ప్లేటు సరిగ్గా లేకపోతే  ఆ వాహనదారుడిని చైన్‌ స్నాచర్‌గా అనుమానిస్తామని ప్రకటించారు. హైదరాబాద్‌ పోలీసుల వద్ద నంబర్‌ ప్లేట్లను సరిగ్గా అమర్చకుండా.. తప్పుడు నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న దాదాపు 2 వేల వాహనాల రికార్డులు తమ దగ్గర ఉన్నాయన్నారు. సరిగ్గా లేని నంబర్‌ ప్లేట్లతో తిరుగుతున్న 384 మందిపై మంగళవారం కేసులు నమోదు చేశామన్నారు. రోడ్లపై నంబర్‌ ప్లేట్లు సరిగ్గా లేకుండా కనపడితే వెంటనే ఫొటోను తీసి 9490616555కు వాట్సాప్ చేయాలని ట్విట్టర్ వేదికగా నగర పౌరులను కోరారు. Updated Date - 2020-03-12T18:13:29+05:30 IST