సూర్యాపేటలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు: ఎస్పీ

ABN , First Publish Date - 2020-05-09T17:31:33+05:30 IST

సూర్యాపేటలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు: ఎస్పీ

సూర్యాపేటలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు: ఎస్పీ

సూర్యాపేట: సూర్యాపేటలో కట్టుదిట్టంగా లాక్‌డౌన్ అమలు చేస్తున్నామని ఎస్పీ భాస్కరన్ తెలిపారు. శనివారం ఉదయం పట్టణంలో లాక్‌డౌన్‌ను ఎస్పీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని చెప్పారు. ప్రతిఒక్కరు బాధ్యతగా మెలగాలని, మాస్క్‌లు తప్పనిసరిగా వాడాలని సూచించారు. నిత్యావసరాలకు బైక్‌పై ఒకరు, అత్యవసర పరిస్థితుల్లో ఇద్దరికి అనుమతి ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1,955 మందిపై 1236 కేసులు నమోదు చేశామని...దాదాపు 4779 వాహనాలు సీజ్ చేసినట్లు ఎస్పీ భాస్కర్ తెలిపారు. 

Updated Date - 2020-05-09T17:31:33+05:30 IST