ఎస్పీడీసీఎల్‌లో ధర్మాధికారి నివేదిక అమలు

ABN , First Publish Date - 2020-12-20T08:00:10+05:30 IST

ధర్మాధికారి తుది నివేదిక ఆధారంగా ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌)లో 81 మంది ఉద్యోగులను చేర్చుకుంటూ సీఎండీ జి.ర ఘుమారెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు.

ఎస్పీడీసీఎల్‌లో ధర్మాధికారి నివేదిక అమలు

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ధర్మాధికారి తుది నివేదిక ఆధారంగా ఎస్పీడీసీఎల్‌ (హైదరాబాద్‌)లో  81 మంది ఉద్యోగులను చేర్చుకుంటూ సీఎండీ జి.ర ఘుమారెడ్డి శనివారం ఉత్తర్వులిచ్చారు. 81 మందిని తెలంగాణలో చేర్చుకొని.. అంతే స్థాయిలో ఏపీకి రిలీవ్‌ చేస్తూ ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతోపాటు 32 మంది పెన్షనర్లను కూడా చేర్చుకున్నారు.


ఇక వీరిలో ముగ్గురు ఇప్పటికే మృత్యువాతపడగా... ఆ కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్‌ను అందించనున్నారు. ఒక అధికారి ఉద్యోగానికి రాజీనామా చేయగా.. మరొకరు రెస్‌కో పూర్వ ఉద్యోగి. ఈ ఉద్యోగులకు, పెన్షనర్లకు డి సెంబరు నుంచే వేతనాలు ఇవ్వనున్నారు. 2014 జూన్‌ 2నాటికి ఉన్న కేడర్‌ ఆధారంగా సీనియారిటీని ఖరారు చేయనున్నారు. 


Updated Date - 2020-12-20T08:00:10+05:30 IST