శస్త్రచికిత్సలకు అనుమతులను రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-12T05:07:35+05:30 IST

శస్త్రచికిత్సలకు అనుమతులను రద్దు చేయాలి

శస్త్రచికిత్సలకు అనుమతులను రద్దు చేయాలి
నర్సంపేట ఐఎంఏ హాల్‌లో మాట్లాడుతున్న విద్యాసాగర్‌రెడ్డి

ఐఎంఏ అధ్యక్షుడు లెక్కల విద్యాసాగర్‌రెడ్డి

నర్సంపేట, డిసెంబరు 11: ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసేందుకు ఇచ్చిన అనుమతులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలని నర్సంపేట ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, వైద్యులు ఎ.రాజేంద్రప్రసాద్‌రెడ్డి, జాన్సర్‌, గోపాల్‌ డిమాండ్‌ చేశారు. పట్టణంలోని ఐఎంఏ హాల్‌లో శుక్రవారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. ఐఎంఏ జాతీయ కమిటీ పిలుపు మేరకు నర్సం పేటలోని ప్రైవేటు ఆస్పత్రులను శుక్రవారం ఉదయం 6నుంచి సాయంత్రం 6గంటల వరకు మూసివేశామన్నారు. కొవిడ్‌, అత్యవసర వైద్యసేవలు అందించి ఓపీ వైద్యసేవలు చేయలేదన్నారు. ఆయుర్వేద వైద్యులు 39 రకాల శస్త్రచికిత్సలు చేసేందుకు సెంట్రల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియన్‌ మెడిసిన్‌(సీసీఐఎం) అనుమతి ఇవ్వడాన్ని నర్సంపేట ఐఎంఏ వ్యతిరేకిస్తుందన్నారు. శస్త్రచికిత్సలు చేసేందుకు నిపుణులైన వైద్యుల అవసరం ఉంటుందని తెలిపారు. సర్జరీలు చేసే సమయంలో ఎన్నో సమస్యలు వస్తుంటాయన్నారు.ఎలాంటి అను భవంలేని ఆయుర్వేద వైద్యులు శస్త్రచికిత్సలు ఎలా చేయగలుగుతారని వారు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడే అవకాశా లుంటాయనిపేర్కొన్నారు.సమావేశంలో వైద్యులు కిరణ్‌, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T05:07:35+05:30 IST