ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్స ఎలా చేస్తారు..

ABN , First Publish Date - 2020-12-11T04:55:22+05:30 IST

కేంద్రం ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతినిస్తూ ఇచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, జీవోకు నిరసనగా నేడు(శుక్రవారం) ప్రైవేట్‌ ఆస్పత్రులు బంద్‌ను పాటించనున్నాయని నర్సంపేట ఐఎంఏ శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాన్సన్‌లు తెలిపారు.

ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్స ఎలా చేస్తారు..
10ఎన్‌ఎస్‌పిటి03 సమావేశంలో మాట్లాడుతున్న ఐఎంఏ వైద్యులు

ఆయుర్వేద వైద్యులు శస్త్ర చికిత్స ఎలా చేస్తారు.. 

నిరసనగా నేడు ప్రైవేట్‌ ఆస్పత్రుల బంద్‌

నర్సంపేట టౌన్‌, డిసెంబరు  10 : కేంద్రం ఆయుర్వేద వైద్యులకు శస్త్ర చికిత్సలు చేసేందుకు అనుమతినిస్తూ ఇచ్చిన  జీవోను వెంటనే  ఉపసంహరించుకోవాలని, జీవోకు  నిరసనగా నేడు(శుక్రవారం) ప్రైవేట్‌ ఆస్పత్రులు బంద్‌ను  పాటించనున్నాయని నర్సంపేట ఐఎంఏ శాఖ  అధ్యక్షుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి జాన్సన్‌లు తెలిపారు. గురువారం పట్టణంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా కేంద్ర ం అనుసరిస్తున్న విధానాలతో ప్రజలకు  అన్యాయం జరిగే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో వైద్యులు కిషన్‌, గోపాల్‌, జయుడు పాల్గొన్నారు.

===============


జిల్లాలో 13 కరోనా కేసులు

వరంగల్‌ రూరల్‌ కల్చరల్‌, డిసెంబరు 10: జిల్లాలో గురువారం 13 కరోనా కేసులు నమోదయ్యాయి. బానోజీపేట (నర్సంపేట) పీహెచ్‌సీ పరిధిలో 8, చెన్నారావుపేటలో రెండు, దామెర, ఖానాపూర్‌, కేశవాపూర్‌లో ఒకటి చొప్పున కేసులు నమోదయ్యాయి.

==============

Updated Date - 2020-12-11T04:55:22+05:30 IST