యుద్ద ప్రాతిపదికన ఐకియా జంక్షన్‌ బ్యూటిఫికేషన్‌ పనులు

ABN , First Publish Date - 2020-04-30T23:51:24+05:30 IST

నగరంలోని హైటెక్‌సిటీ ఐటి కారిడార్‌లో ఉన్న ఐకియా జంక్షన్‌ను ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి.

యుద్ద ప్రాతిపదికన ఐకియా జంక్షన్‌ బ్యూటిఫికేషన్‌ పనులు

హైదరాబాద్‌: నగరంలోని హైటెక్‌సిటీ ఐటి కారిడార్‌లో ఉన్న ఐకియా జంక్షన్‌ను ఆధునీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. నిత్యం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో బ్యూటిఫికేషన్‌పనులు నిర్వహించడం శ్రమతో కూడుకున్న పని. అయితే లాక్‌డౌన్‌నేపధ్యంలో ఈ పనులు పూర్తిచేయాలని హెచ్‌ఎండిఏ అధికారులు నిర్ణయుంచి పనులు కొనసాగిస్తున్నారు. శరవేగంగా జరుగుతున్న పనులను గురువారం మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అర్వింద్‌కుమార్‌ పరిశీలించారు. మరో వారం రోజుల్లో పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.


ఈ ప్రాంతంలో ల్యాండ్‌స్కేప్‌ బ్యూటిఫికేషన్‌ పనులను హచ్‌ఎండిఏ అర్బన్‌ఫారెస్ర్టీ అధికారులు పూర్తిచేస్తున్నారు. ఇక్కడి బ్యూటివఫికేషన్‌ పనులను రెండు ప్యాకెట్‌లు విభజించిపనులు నిర్వహిస్తున్నారు. ల్యాండ్‌స్కేప్‌తో పాటు వివిధ రకాల ఆకృతులతో కూడిన శిలలను ఏర్పాటుచేస్తున్నారు. అలాగే ఏజ్‌ ఓల్డ్‌ ఈస్తటిక్‌ ట్రీ ఏర్పాటు చేస్తున్నారు. జంక్షన్‌ ఇంప్రూవ్‌మెంట్‌లో భాగంగా గ్రీనరీతో పాటు వివిధ రకాల మెటల్‌తో తయారైన జంతువుల ఆకృతులను కూడా ఇక్కడ ఏర్పాటుచేస్తున్నారు. ఆలివ్‌ ట్రీస్‌, స్టోన్‌ కార్వింగ్‌ పనులు పూర్తికావస్తున్నాయి. త్వరలోనే ఈ పనులు పూర్తయితే ఇక్కడి ప్రాంతమంతా అద్భుతంగా మారుతుందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-04-30T23:51:24+05:30 IST