దాడులకు ఐజేయూ ఖండన

ABN , First Publish Date - 2020-03-04T09:47:50+05:30 IST

జర్నలిస్టులపై దాడులను ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఢిల్లీలో అల్లర్ల వార్తలను కవర్‌ చేందుకు వెళ్లిన జర్నలిస్టులపై

దాడులకు ఐజేయూ ఖండన

హైదరాబాద్‌ మార్చి 3 (ఆంధ్రజ్యోతి): జర్నలిస్టులపై దాడులను ఇండియన్‌ జర్నలిస్టుల యూనియన్‌ (ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇటీవల ఢిల్లీలో  అల్లర్ల వార్తలను కవర్‌ చేందుకు వెళ్లిన  జర్నలిస్టులపై దాడులు జరుగడం దురదృష్టకరం అని ఐజేయూ అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులపై దాడులు నిరోధించేందుకు ప్రత్యేకంగా రక్షణ చట్టాన్నిరూపొందించాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల లఖ్‌నవూలో జరిగిన ఐజేయూ జాతీయ కార్యవర్గ సమావేశ తీర్మానాలను ఆయన మంగళవారం ఓ ప్రకటనలో వివరించారు.

Updated Date - 2020-03-04T09:47:50+05:30 IST