దేశీ వర్సిటీల్లో పీహెచ్‌డీకి వేళ్లలేని వారికి ఐఐఐటీ హైదరాబాద్‌ మరో అవకాశం

ABN , First Publish Date - 2020-06-18T09:55:43+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందిన పీహెచ్‌డీ విద్యార్థుల

దేశీ వర్సిటీల్లో పీహెచ్‌డీకి వేళ్లలేని వారికి ఐఐఐటీ హైదరాబాద్‌ మరో అవకాశం

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో విదేశీ యూనివర్సిటీలలో అడ్మిషన్లు పొందిన పీహెచ్‌డీ విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లాక్‌డౌన్‌తో కోర్సు ప్రారంభం, తరగతుల నిర్వహణపై ఎటువంటి స్పష్టత లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని విదేశీ వర్సిటీల్లో పీహెచ్‌డీ కోర్సుల్లో అడ్మిషన్‌ పొందిన వారికి ఐఐఐటీ హైదరాబాద్ ‌ఒక ప్రత్యేక కోర్సును ప్రవేశపెట్టింది. ఈ కోర్సులో ప్రవేశం పొందిన విద్యార్థులు వారు ఎంచుకున్న అంశంపై ఐఐఐటీ హైదాబాద్‌లోనే ఏడాదిపాటు పరిశోధనలు చేయొచ్చు.


తరవాత నచ్చిన యూనివర్సిటీకి వెళ్లవచ్చు లేదా ఇక్కడే రెగ్యులర్‌ పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది.  ఎంపికైన విద్యార్థులకు నిబంధనల మేరకు స్కాలర్‌షిప్‌ సౌకర్యం కల్పిస్తారు. ఆసక్తి గలవారు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో రూ.1500 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో వచ్చే నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు. మరిన్ని వివరాలను ఐఐఐటీ వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. 

Updated Date - 2020-06-18T09:55:43+05:30 IST