ఐఐటీహెచ్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు భారీ స్పందన
ABN , First Publish Date - 2020-12-10T10:06:00+05:30 IST
ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఈ సంవత్సరం భారీ స్పందన లభించింది. తొలిదశ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఈ నెల 1న ప్రారంభం కాగా, బుధవారం నాటికి 63 సంస్థల నుంచి 222 మంది విద్యార్థులకు ప్రీ-ప్లె్‌సమెంట్ ఆఫర్లు వచ్చాయి. అందులో 30 మందికి జపాన్, తైవాన్ దేశాల్లోని 8 కంపెనీలు అవకాశాలు కల్పించాయి. మైక్రోసాఫ్ట్,

222 మందికి ప్రీ-ప్లెస్‌మెంట్ ఆఫర్లు
కంది, డిసెంబరు 9 : ఐఐటీ హైదరాబాద్‌లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్లకు ఈ సంవత్సరం భారీ స్పందన లభించింది. తొలిదశ క్యాంపస్ ప్లేస్‌మెంట్లు ఈ నెల 1న ప్రారంభం కాగా, బుధవారం నాటికి 63 సంస్థల నుంచి 222 మంది విద్యార్థులకు ప్రీ-ప్లె్‌సమెంట్ ఆఫర్లు వచ్చాయి. అందులో 30 మందికి జపాన్, తైవాన్ దేశాల్లోని 8 కంపెనీలు అవకాశాలు కల్పించాయి. మైక్రోసాఫ్ట్, గోల్డ్‌మన్‌సాచ్, జాగ్వార్‌ల్యాండ్ రోవర్, ఎంటీఎక్స్, బీఎన్‌వై మిల్లర్, రేజర్‌పే, అల్ఫోన్స్ ఇంక్, ఒప్పో, టీఎ్‌సఎంపీ లాంటి అంతర్జాతీయ కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసుకున్నాయి. 2020-2021 ఐఐటీహెచ్‌క్యాంప్‌స ప్లేస్‌మెంట్లకు వివిధ దేశాల్లోని 116 కంపెనీలు నమోదు చేసుకోగా, 500 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగ అవకాశాల కోసం రిజిస్టర్ చేసుకున్నారు. కొవిడ్ కారణంగా విద్యార్థులంతా వారి వారి ఇళ్ల వద్ద నుంచే ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారని ఐఐటీహెచ్ ఫ్యాకల్టీ ఇన్‌చార్జీ (ప్లేస్‌మెంట్స్) డాక్టర్ ప్రదీప్ యెములా పేర్కొన్నారు.
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో 1000కి పైగా ఆఫర్లు
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లోనూ ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థులు మంచి ప్లేస్‌మెంట్లను సాధించగలిగారు. తొలిదశ ప్రాంగణ నియామకాల్లో ఈనెల 8వ తేదీ నాటికి 1000 మందికిపైగా విద్యార్థులకు ప్లేస్‌మెంట్లు లభించాయి. ఇక్కడ కూడా కొవిడ్ కారణంగా తొలిసారి వర్చువల్ విధానంలో ఇంటర్వ్యూలు నిర్వహించారు. 200కు పైగా సంస్థలు అభ్యర్థుల ఎంపికలో పాల్గొన్నాయి.