మద్యం అమ్మినా, కొన్నా రూ.50 వేల జరిమానా

ABN , First Publish Date - 2020-12-13T07:42:28+05:30 IST

మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్‌ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్‌, లక్ష్మీపూర్‌కొలాంగూడ, చింతగూడెం, వెంకటాపూర్‌లలో మద్యం నిషేధించాలని శనివారం మహిళలు అత్యవసర

మద్యం అమ్మినా, కొన్నా రూ.50 వేల జరిమానా

వెంకటాపూర్‌ పంచాయతీ మహిళల అత్యవసర సమావేశ తీర్మానం

కాసిపేట, డిసెంబరు 12 : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం వెంకటాపూర్‌ పంచాయతీ పరిధిలోని లక్ష్మీపూర్‌, లక్ష్మీపూర్‌కొలాంగూడ, చింతగూడెం, వెంకటాపూర్‌లలో మద్యం నిషేధించాలని శనివారం మహిళలు అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు.  మద్యం అమ్మినా, కొనుగోలు చేసినా రూ.50 వేల జరిమానా విధిస్తామని తీర్మానించారు. 


గిరిజన గూడెంలలో  విచ్చలవిడిగా బెల్టుషాపులు కొనసాగుతున్నాయని వెంకటాపూర్‌ సర్పంచ్‌ ఆడె సౌందర్య చెప్పారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ప్రతి కిరాణాదుకాణంలో మద్యం అమ్ముతున్నారన్నారు. యువకులు మద్యానికి బానిసై ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. గిరిజన గూడెంలలో మద్యం అమ్మవద్దని తీర్మానం చేసినట్లు చెప్పారు. 


Updated Date - 2020-12-13T07:42:28+05:30 IST