వీహెచ్‌ను బెదిరిస్తే తిరగబడతాం: బీసీ సంఘాలు
ABN , First Publish Date - 2020-12-27T08:21:06+05:30 IST
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావును కొందరు వ్యక్తులు బెదిరించడాన్ని 14 బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

బర్కత్‌పుర, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావును కొందరు వ్యక్తులు బెదిరించడాన్ని 14 బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఇలాంటి బెదిరింపులు రాజకీయాలలో తగవని, వాటిని మానుకోకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీలు తిరగబడతారని హెచ్చరించాయి. శనివారం విలేకరుల సమావేశంలో బీసీ సంఘాల నాయకులు గుజ్జ కృష్ణ, నీలా వెంకటేష్, జి.మల్లే్‌షయాదవ్, కె.నర్సింహగౌడ్, జి.అంజి, ఉదయ్, జయంతిగౌడ్, బర్క కృష్ణ, టి.ఆర్.చందర్ తదితరులు మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్ష పదవి బీసీలకు ఇవ్వాలని కోరిన వీహెచ్‌ను బెదిరించిన వారు బేషరతుగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.