సమస్య పరిష్కరించకుంటే చస్తాం

ABN , First Publish Date - 2020-10-07T08:19:25+05:30 IST

ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట విద్యుత్తు సరఫరాలో అంతరాయం వల్ల ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర

సమస్య పరిష్కరించకుంటే చస్తాం

 పెట్రోల్‌ డబ్బాలతో  సబ్‌స్టేషన్‌ వద్ద రైతుల ఆందోళన


అల్లాదుర్గం, అక్టోబరు 6: ఆరుగాలం శ్రమించి పండించిన వరి పంట విద్యుత్తు సరఫరాలో అంతరాయం వల్ల ఎండిపోతుండడంతో రైతులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. మెదక్‌ జిల్లా అల్లాదుర్గం విద్యుత్తు సబ్‌స్టేషన్‌ను మంగళవారం ముట్టడించారు. సమస్య పరిష్కరిస్తారా? చావమంటారా? అని పెట్రోల్‌ డబ్బాలతో బైఠాయించారు.


కొచ్చెర్వు కట్ట వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి 25 వ్యవసాయ బోర్లకు విద్యుత్తు సరఫరా అవుతోందని, వారం రోజులుగా అంతరాయం ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బాగుచేయిస్తామని ట్రాన్స్‌కో ఏఈ రాంబాబు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.


Read more