మాస్కు లేకుంటే.. జరిమానా.. జైలు శిక్ష?

ABN , First Publish Date - 2020-06-01T08:50:13+05:30 IST

కరోనా కట్టడి నిబంధనల్లో భాగంగా మాస్కులు ధరించని వారికి జరిమానాతోపాటు.. జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే.. మాస్కు ధరించని వారికి రూ. 1,000

మాస్కు లేకుంటే.. జరిమానా.. జైలు శిక్ష?

హైదరాబాద్‌ సిటీ, మే 31 (ఆంధ్రజ్యోతి): కరోనా కట్టడి నిబంధనల్లో భాగంగా మాస్కులు ధరించని వారికి జరిమానాతోపాటు.. జైలు శిక్ష పడే అవకాశాలున్నాయి. ఇప్పటికే.. మాస్కు ధరించని వారికి రూ. 1,000 జరిమానా విధిస్తామని స్వయానా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కొవిడ్‌-19 పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. మాస్కుల నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ‘‘మాస్కులు ధరించని వారికి జరిమానా విధించడమే కాకుండా, వారిపై పెట్టీ కేసులు నమోదు చేస్తాం. చార్జిషీటు దాఖలు చేసే అవకాశాలున్నాయి. కోర్టులు వారికి జరిమానాతోపాటు, జైలు శిక్ష విధించే అవకాశాలున్నాయి’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

Updated Date - 2020-06-01T08:50:13+05:30 IST