గణపతి లొంగిపోతే పార్టీపై పెను ప్రభావం
ABN , First Publish Date - 2020-09-03T09:33:37+05:30 IST
మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగుబాటుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చని కేంద్ర కమిటీ మాజీ

- లొంగుబాటుపై ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చు: జంపన్న
హైదరాబాద్, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి లొంగుబాటుపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేకపోవచ్చని కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు జంపన్న అన్నారు. ఒకవేళ గణపతి లొంగిపోతే మాత్రం మావోయిస్టు పార్టీపై పెను ప్రభావం ఉంటుందని తెలిపారు. అయితే పార్టీ నుంచి ఎవరైనా లొంగిపోవాలంటే తుది నిర్ణయం కమిటీదేనని జంపన్న ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు. తనకు తెలిసినంత వరకు గణపతికి ఆరోగ్య సమస్యలులేవని ఒక వేళ ఉన్నా ప్రచారం జరుగుతున్నంత స్థాయిలో ఆరోగ్యం క్షీణించి ఉండకపోవచ్చని పేర్కొన్నారు. గణపతి లొంగుబాటుకు ఆయన బంధువులు ప్రయత్నాలు చేస్తున్నారనడంలోనూ వాస్తవం లేదన్నారు. గణపతితోపాటు మరికొంత మంది లొంగిపోతున్నట్లు జరుగుతున్న ప్రచారం కూడా అవాస్తవమన్నారు.