రాష్ట్రంలో రెండోరోజూ కొనసాగిన ‘సీరో’ సర్వే

ABN , First Publish Date - 2020-05-17T09:26:48+05:30 IST

గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) చేపట్టిన ‘సీరో’ సర్వే...

రాష్ట్రంలో రెండోరోజూ కొనసాగిన ‘సీరో’ సర్వే

కామారెడ్డి/నల్లగొండ టౌన్‌, మే 16 : గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని అంచనా వేసేందుకు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) చేపట్టిన ‘సీరో’ సర్వే రెండోరోజూ(శనివారం) రాష్ట్రంలో కొనసాగింది. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో 200 రక్త నమూనాలను నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌(ఎన్‌ఐఎన్‌)నిపుణుల బృందం సేకరించింది. నల్లగొండలో మరో 200 రక్త నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమాలజీకి పంపించారు. 

Updated Date - 2020-05-17T09:26:48+05:30 IST