రెండో రోజూ కొనసాగిన ఐసీఎంఆర్ సర్వే
ABN , First Publish Date - 2020-12-30T04:21:27+05:30 IST
రెండో రోజూ కొనసాగిన ఐసీఎంఆర్ సర్వే
జనగామ, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్ వ్యాప్తి, ప్రజల ఆరోగ్య స్థితిగతులపై పరిశీలన జరిపేందుకుగాను జనగామ జిల్లాలో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐసీఎంఆర్ చేపట్టిన సర్వే రెండో రోజూ కొనసాగింది. జిల్లాలోని పాలకుర్తి, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, మల్కాపూర్ పీహెచ్‌సీల్లో మంగళవారం ఐసీఎంఆర్ బృందాలు సర్వే నిర్వహించి వైద్య సిబ్బంది రక్త నమూనాలను సేకరించారు. జిల్లా వ్యాప్తంగా నాలుగు పీహెచ్‌సీల పరిధిలో 120 రక్త నమూనాలను సేకరించారు. ఈ సర్వేలో ఐసీఎంఆర్ బృందం అధికారులు అర్లప్ప, సంతో్‌షకుమార్ పాల్గొన్నారు. ఈ సర్వే బుధవారమూ కొనసాగుతుందని, జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు.