నగేశ్ చెప్పినట్లు వినుంటే నేనూ జైలుకెళ్లేవాడిని
ABN , First Publish Date - 2020-09-12T05:30:00+05:30 IST
అవినీతి కేసులో ఏసీబీ అధికారికి పట్టుబడ్డ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, తన బినామీ జీవన్ గౌడ్‌కు మైనింగ్ క్వారీని కట్టబెట్టాలనుకున్నారా? ఇందుకు అనుమతివ్వాలంటూ తహసీల్దార్‌పై ఆయన

ఎమ్మెల్యే మదన్ రెడ్డి సమక్షంలో
వెల్లడించిన శివ్వంపేట తహసీల్దార్
మెదక్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): అవినీతి కేసులో ఏసీబీ అధికారికి పట్టుబడ్డ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్, తన బినామీ జీవన్ గౌడ్‌కు మైనింగ్ క్వారీని కట్టబెట్టాలనుకున్నారా? ఇందుకు అనుమతివ్వాలంటూ తహసీల్దార్‌పై ఆయన ఒతి డి తెచ్చారా? పలు భూములకు సంబంధించి జీవన్‌గౌడ్‌కు అనుకూలంగా నివేదిక ఇవ్వాలంటూ నగేశ్ ఒత్తిడి తెచ్చారంటూ సదరు తహసీల్దార్ వెల్లడించిన విషయాన్ని బట్టి ఔననే అనిపిస్తోంది. ఈ మేరకు జీవన్‌గౌడ్‌కు అనుకూలంగా ఎన్‌వోసీలు ఇవ్వాలని తనపై నగేశ్ ఒత్తిడి తెచ్చారని, తాను అలా చేసివుంటే జైల్లో ఉండేవాడనినని శివ్వంపేట తహసీల్దార్ భానుప్రకాశ్ పేర్కొన్నారు.
శనివారం చండి గ్రామంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా తహసీల్దార్ పై వ్యాఖ్యలు చేశా రు. ప్రభుత్వ భూమిని కాపాడానని, తానెక్కడా తప్పు చేయలేదన్నారు. ఈ విషయం తెలియక తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తహసీల్దార్ ఆరోపణలతో అవాక్కైన పలువురు నాయకులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.