జర్నలిస్టులు కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలి-అర్వింద్‌కుమార్‌

ABN , First Publish Date - 2020-05-19T00:08:19+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడకుండా జర్నలిస్టులు తమను తాము రక్షించుకోవాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రరటీ అర్వింద్‌కుమార్‌ అన్నారు.

జర్నలిస్టులు కరోనా నుంచి తమను తాము రక్షించుకోవాలి-అర్వింద్‌కుమార్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ బారిన పడకుండా జర్నలిస్టులు తమను తాము రక్షించుకోవాలని మున్సిపల్‌శాఖ ప్రిన్సిపల్‌ సెక్రరటీ అర్వింద్‌కుమార్‌ అన్నారు. సమాచార సేకరణలో జర్నలిస్టులు ముందు వరసలో ఉంటారని వారికి రక్షణ తప్పనిసరి అన్నారు. ప్రస్తుతం పరిస్థితి వారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సోమవారం సమాచార, పౌరసంబంధాలశాఖ కార్యాలయంలో జర్నలిస్టులకు కరోనా మెడికల్‌కిట్స్‌ను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార సేకరణలోనే కాదు, ప్రజలు కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకునే విధంగా అవగాహన కల్పించడంలో జర్నలిస్టులు కూడా కృషి చేస్తున్నారని అన్నారు. కోవిడ్‌-19పై అవగాహన కలిగి ఉండడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. 


నిర్లక్ష్యం వహిస్తే మాత్రం వ్యాధిబారినపడడమే కాకుండా ఇతరులకు వ్యాప్తిచేసిన వారవుతారని అన్నారు. ఇంతకు ముందు  750 మందికి సేఫ్టీ కిట్స్‌ పంపిణీ చేశామని, రెండో విడతగా సోమవారం 500 మందికి పంపిణీ చేసినట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఏ, సెక్రటేరియట్‌ బీట్‌లు చూసే వారికి ఈ కిట్స్‌ అందిస్తున్నట్టు చెప్పారు. 6లక్షల విలువగల కిట్స్‌లో డబుల్‌లేయర్‌ క్లాత్‌మాస్క్‌లు, ఫేస్‌షీల్డ్స్‌, ఎన్‌-95 మాస్క్‌లు, 200 మి.లీ. శానిటైజర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ముఇన్సపల్‌ అడ్మినిస్ర్టేషన్‌ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, పౌరసంబంధాలశాఖ అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య కాంబ్లే, ఫిలిండెవలప్‌మెంట్‌కార్పొరేషన్‌ ఈడీ కిషోర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-19T00:08:19+05:30 IST