హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

ABN , First Publish Date - 2020-09-18T01:13:33+05:30 IST

నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, నాంపల్లితోపాటు సైఫాబాద్..

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో పలు ప్రాంతాల్లో భారీగా వర్షం కురిసింది. మెహదీపట్నం, మాసబ్‌ట్యాంక్, నాంపల్లితోపాటు సైఫాబాద్, నారాయణగూడ, హిమాయత్‌నగర్‌, ముషీరాబాద్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్‌‌లోనూ వర్షం కురిసింది.  లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. దీంతో ప్రధాన జంక్షన్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 

Updated Date - 2020-09-18T01:13:33+05:30 IST