మీడియా ప్రతినిధులకు శానిటైజర్ కిట్లను పంపిణీ చేసిన టీపీజేసీఏ

ABN , First Publish Date - 2020-04-05T19:19:17+05:30 IST

తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్స్(టీపీజేసీఏ) తమ దాతృత్వాన్ని చాటుకుంటోంది.

మీడియా ప్రతినిధులకు శానిటైజర్ కిట్లను పంపిణీ చేసిన టీపీజేసీఏ

హైదరాబాద్: తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ అసోసియేషన్(టీపీజేసీఏ) తమ దాతృత్వాన్ని చాటుకుంటోంది. కరోనా వైరస్‌పై పోరాటంలో ప్రాణాలు ఒడ్డుతున్న డాక్టర్లు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది, మీడియా ప్రతినిధులకు శానిటైజర్లు, గ్లౌజులు, మాస్కులు పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటి వరకు 12,500 కిట్లను అందించారు. అందులో భాగంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంలో కూడా ఈ కిట్లను పంచారు. ఈ కార్యక్రమంలో టీపీజేసీఏ రాష్ట్ర అధ్యక్షుడు జి. సతీశ్ తదితరులు పాల్గొన్నారు.   

Updated Date - 2020-04-05T19:19:17+05:30 IST