హైదరాబాద్‌ ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

ABN , First Publish Date - 2020-04-07T09:18:03+05:30 IST

హైదరాబాద్‌ వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఓ రోజు తీవ్ర ఉష్ణోగ్రతలు.. మరో రోజు చల్లదనం నమోదవుతోంది. కరోనా నేపథ్యంలో ఈ మార్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం వరకు సగటున 36.7 డిగ్రీల గరిష్ట

హైదరాబాద్‌ ఉష్ణోగ్రతల్లో అనూహ్య మార్పులు

  • వేడి తగ్గితే కరోనా విజృంభించే అవకాశం

హైదరాబాద్‌ వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. ఓ రోజు తీవ్ర ఉష్ణోగ్రతలు.. మరో రోజు చల్లదనం నమోదవుతోంది. కరోనా నేపథ్యంలో ఈ మార్పులు ఆందోళనకు గురి చేస్తున్నాయి. రెండ్రోజుల క్రితం వరకు సగటున 36.7 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, రెండు రోజులుగా ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తోంది. కాగా, మారాఠ్వాడలో 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం, దక్షిణ కర్ణాటకలో ఉపరితల ద్రోణి వల్ల వాతావరణంలో మార్పులు వచ్చాయని హైదరాబాద్‌ వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కాగా.. ప్రజలు ఏసీలను వినియోగించకూడదని, పరిశుభ్రతను పాటిస్తూ.. మాస్కులను ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.

Read more