హైదరాబాద్: పెట్రోల్‌బంకులపై ఎస్వోటీ దాడులు

ABN , First Publish Date - 2020-09-05T15:55:22+05:30 IST

సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు.

హైదరాబాద్: పెట్రోల్‌బంకులపై ఎస్వోటీ దాడులు

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో అవకతవకలకు పాల్పడుతున్న పెట్రోల్ బంకులపై ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పెట్రోల్ తక్కువ వచ్చి, మీటర్ మాత్రం కరెక్ట్‌గా చూపించే విధంగా ఛిప్‌లను పెట్రోల్ బంక్ నిర్వాహకులు అమర్చి జనాలను మోసం చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు హైదరాబాద్ పరిధిలోని 13 పెట్రోల్ బంకులను సీజ్ చేశారు. సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని 26 బంక్‌లను ఏపీ పోలీసులు సీజ్ చేశారు. ప్రత్యేక చిప్‌లను బంకు యజమానులు మహారాష్ట్ర నుండి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇది ఒక గ్యాంగ్ గా ఏర్పడి ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నట్లు  సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు గుర్తించారు. పెట్రోల్ బంకులలో మోసాలకు పాల్పడుతున్న 26 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుండి ప్రత్యేకంగా చిప్‌లను తెప్పించుకున్న బంక్ నిర్వాకులు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పెట్రోల్ బంకులు అమర్చుకున్నారు.  దీని ద్వారా కోట్ల రూపాయలను మోసం చేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. 


Updated Date - 2020-09-05T15:55:22+05:30 IST