రాణిగంజ్: ఈ నెల 28 నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్

ABN , First Publish Date - 2020-06-26T23:01:07+05:30 IST

జంట నగరాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 28వ తేదీ నుంచి

రాణిగంజ్: ఈ నెల 28 నుంచి స్వచ్ఛంద లాక్ డౌన్

సికింద్రాబాద్‌: జంట నగరాల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ నెల 28 నుంచి రాణిగంజ్ మార్కెట్‌లో స్వ‌చ్ఛందంగా లాక్‌డౌన్ పాటిస్తున్న‌ట్టు స్థానికులు ప్రకటించారు. దీంతో 8 రోజుల పాటు రాణిగంజ్ హ‌బ్‌లోని 5 వేల షాపులు బంద్ కానున్నాయి. నగరంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండటంతో స్థానికులు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గురువారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 920 కేసులు నమోదు కాగా, ఒక్క సికింద్రాబాద్ సర్కిల్‌లోనే 141 కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వారం రోజుల పాటు వ్యాపారాలు నిలిపేయాలని నిర్ణయించారు.  

Updated Date - 2020-06-26T23:01:07+05:30 IST