హైదరాబాద్‌ రోహింగ్యా టీవీ.. వైరల్‌గా మారిన వైనం

ABN , First Publish Date - 2020-09-03T12:22:55+05:30 IST

హైదరాబాద్‌ రోహింగ్యా టీవీ పేరిట ఓ యూట్యూబ్‌ చానెల్‌ నడుస్తున్నట్లు వైరల్‌గా మారింది.

హైదరాబాద్‌ రోహింగ్యా టీవీ.. వైరల్‌గా మారిన వైనం

  • తెలియదంటున్న రోహింగ్యాలు, బాలాపూర్‌ పోలీసులు


హైదరాబాద్‌ : హైదరాబాద్‌ రోహింగ్యా టీవీ పేరిట ఓ యూట్యూబ్‌ చానెల్‌ నడుస్తున్నట్లు వైరల్‌గా మారింది. బర్మాకు చెందిన కొంతమంది కలిసి ఈ చానెల్‌ నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో ఓ వ్యక్తి రోహింగ్యా భాషలో ప్రసంగాలు చేస్తున్నట్లు కొన్ని వీడియోలు అప్‌లోడ్‌  చేసి ఉన్నాయి. దానికి సంబంధించి కొన్ని కామెంట్లు కూడా ఉన్నాయి.


ఆ చానెల్‌కు సుమారు నాలుగువేల మంది సబ్‌స్ర్కైబర్‌లు ఉన్నారు. చానెల్‌లో ఏమి ఉందని పహాడిషరీ్‌ఫకు చెందిన ఓ రోహింగ్యాను ప్రశ్నించగా.. చానెల్‌ గురించి తనకు తెలియదన్నాడు. వీడియోలో ప్రధానంగా షేక్‌ అలీ అనే వ్యక్తి ప్రసంగాలు ఉన్నాయి. చానెల్‌లో ఉన్న వ్యక్తిని రోహింగ్యాలు గుర్తించలేకపోయారు. ఈ విషయమై బాలాపూర్‌ పోలీసులను ప్రశ్నించగా.. యూట్యూబ్‌ చానెల్‌ గురించి తమకు తెలియదన్నారు. చానెల్‌ గురించి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. 

Updated Date - 2020-09-03T12:22:55+05:30 IST