ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-07-22T16:50:24+05:30 IST

నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి వ్యక్తి మృతి

హైదరాబాద్: నగరంలోని ముసరాంబాగ్ బ్రిడ్జి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ముసరాంబాగ్ నుండి అంబర్పేట్ వైపు స్కూటీపై వస్తుండగా ఘటన చోటుచేసుకుంది. మృతుడు రామంతపూర్‌కు చెందిన రాహుల్ రెడ్డి‌గా గుర్తించారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2020-07-22T16:50:24+05:30 IST