మూడు రోజులు వర్షాలు

ABN , First Publish Date - 2020-09-29T07:25:23+05:30 IST

మూడు రోజులు వర్షాలు

మూడు రోజులు వర్షాలు

రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు వాయువ్య భారతదేశం(రాజస్థాన్‌ మరియు పంజాబ్‌) నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభమైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 2, 3 రోజులలో రాజస్థాన్‌, పంజాబ్‌లోని కొన్ని ప్రాంతాలు.. హరియాణా, చండీగఢ్‌, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాల నిష్క్రమణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వాతావరణ కేంద్రం వివరించింది.

Updated Date - 2020-09-29T07:25:23+05:30 IST