గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

ABN , First Publish Date - 2020-04-28T13:50:06+05:30 IST

పురుటి నొప్పులు వస్తున్న గర్భిణికి గాంధీనగర్‌ ఆదివారం అర్ధరాత్రి సుల్తాన్‌బజార్‌లోని

గర్భిణికి అర్ధరాత్రి పురిటి నొప్పులు.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

  • మగబిడ్డకు జన్మనిచ్చిన సంధ్యాదేవి

హైదరాబాద్/కవాడిగూడ : పురుటి నొప్పులు వస్తున్న గర్భిణికి గాంధీనగర్‌ ఆదివారం అర్ధరాత్రి సుల్తాన్‌బజార్‌లోని మెటర్నిటీ ఆస్పత్రిలో చేర్పించగా మగశిశువుకు జన్మనిచ్చింది. బన్సీలాల్‌పేటలో నివసిస్తున్న బిహార్‌కు చెందిన సంధ్యాదేవికి పురిటినొప్పులు రావడంతో స్థానిక నాయకులు గాంధీనగర్‌ డీఐ ప్రమోద్‌కుమార్‌ను సహాయం అడిగారు. పోలీసులు బన్సీలాల్‌పేట చేరుకొని ఆమెతోపాటు కుటుంబ సభ్యులను పోలీసు వాహనంలో సుల్తాన్‌బజార్‌లోని మెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి 12 గంటలకు మగ శిశువుకు జన్మనిచ్చింది. ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Updated Date - 2020-04-28T13:50:06+05:30 IST