జేఎన్టీయూ పరీక్షలు వాయిదా

ABN , First Publish Date - 2020-10-14T02:17:28+05:30 IST

భారీ వర్షాల దృష్ట్యా జేఎన్టీయూ పరీక్షలు వాయిదా వేశారు. యూజీ అండ్‌ పీజీ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు..

జేఎన్టీయూ పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: భారీ వర్షాల దృష్ట్యా జేఎన్టీయూ పరీక్షలు వాయిదా వేశారు. యూజీ అండ్‌ పీజీ రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జేఎన్టీయూ హెచ్‌ ప్రకటించారు. సవరించిన పరీక్షల తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు. ఇతర పరీక్షల షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులేదని స్పష్టం చేశారు. 


కాగా బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలో రాబోయే రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. కొన్ని చోట్ల భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కాగా ఈ భారీ వర్షాలకు సంబంధించి జీహెచ్ఎంసీ ఓ ప్రకటన విడుదల చేసింది. మరో రెండు రోజులపాటు జీహెచ్ఎంసీలో అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.Updated Date - 2020-10-14T02:17:28+05:30 IST