డ్రగ్స్ తయారీకి డెన్‌గా మారుతున్న హైదరాబాద్

ABN , First Publish Date - 2020-12-13T20:11:50+05:30 IST

డ్రగ్స్ తయారీకి డెన్‌గా హైదరాబాద్ మారుతోంది. జీడిమెట్లలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు.

డ్రగ్స్ తయారీకి డెన్‌గా మారుతున్న హైదరాబాద్

హైదరాబాద్: డ్రగ్స్ తయారీకి డెన్‌గా హైదరాబాద్ మారుతోంది. జీడిమెట్లలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై అధికారులు దాడులు చేశారు. ఈ దాడిలో 250 కిలోల మెపిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ రా మెటీరియల్ తయారుచేసి ముంబై నిందితుడు శ్రీనివాసరావు పంపుతున్నట్లు గుర్తించారు. ప్రముఖ ఫార్మా కంపెనీలో బయోకెమిస్ట్రీగా శ్రీనివాసరావు పనిచేస్తున్నాడు. ముంబై కేంద్రంగా డ్రగ్స్ దందా నడుస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మెపిడ్రిన్‌తో ఎండీఎంఏ, కొకైన్, అంపెటమిన్ డ్రగ్స్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. మియావ్ మియావ్ డ్రోన్ పేర్లతో డ్రగ్స్ విక్రయాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులే లక్ష్యంగా డ్రగ్స్ విక్రయాలు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. 


ఫార్మా కంపెనీల్లో పని చేసే కొంతమంది కేటుగాళ్లు మాఫియాతో చేతులు కలిపి ఇక్కడి పారిశ్రామికవాడల్లోనే డ్రగ్స్‌ను తయారు చేస్తున్నారు. వాటిని స్థానికంగా విక్రయించడమే కాదు.. ఎగుమతులు కూడా చేస్తున్నారు. ఇందుకు నిఘా వ్యవస్థ కన్నుపడని మూతపడిన రసాయన, ఫార్మా పరిశ్రమలు కేంద్రాలుగా మారుతున్నాయి. వాటి యజమానులకు మాఫియా పెద్ద మొత్తంలో డబ్బు ఎరగా వేసి డ్రగ్స్‌ను తయారు చేస్తోంది. తక్కువ ఖరీదు రసాయనాలను రియాక్టర్లలో ప్రాసెస్‌ చేసి.. అంతర్జాతీయ స్థాయిలో విలువైన డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తున్నారు.

Updated Date - 2020-12-13T20:11:50+05:30 IST