వర్షాల ఎఫెక్ట్.. సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడి..
ABN , First Publish Date - 2020-10-21T12:08:07+05:30 IST
ముంపు ప్రాంతాల్లో 70 శాతం మంది ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇటీవల పాతనగరంలో 300 మందిని సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. వారందించిన వివరాల ప్రకారం 70 శాతం మంది దురదతో

హైదరాబాద్ : ముంపు ప్రాంతాల్లో 70 శాతం మంది ఫంగల్ ఇన్‌ఫెక్షన్లతో బాధపడుతున్నట్లు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇటీవల పాతనగరంలో 300 మందిని సంప్రదించి ఈ సర్వేను నిర్వహించినట్లు సంస్థ పేర్కొంది. వారందించిన వివరాల ప్రకారం 70 శాతం మంది దురదతో కూడిన ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు, 10 శాతం మంది జ్వరం, ఒళ్లు నొప్పులతో, మరో 20 శాతం మంది నీళ్ల విరేచనాలతో బాధపడుతున్నట్లు సర్వే ద్వారా తేలిందన్నారు.
టెలీ మెడిసిన్ ద్వారా సేవలు
బాధితులకు ఫీవర్ కిట్లు, ఫీవర్ సర్వైలెన్స్ ఫార్మ్స్ అందజేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. వారికి టెలీ మెడిసిన్ ద్వారా సేవలు అందిస్తున్నామని, అవసరమైన వారికి వైద్యం అందించి మందులు పంపిణీ చేస్తున్నట్లు సంస్థ నిర్వాహకుడు అక్సారీ తెలిపారు. అత్యవసర వైద్యసేవలకు హెల్ప్‌లైన్ నంబర్లు 87906 79505లో సంప్రదించాలని కోరారు.