హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-06-23T14:27:52+05:30 IST
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్: నగరంలోని నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రతీక్ ఫర్నిచర్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపునకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.