చల్లబడ్డ హైదరాబాద్..!
ABN , First Publish Date - 2020-05-18T13:04:53+05:30 IST
హైదరాబాద్ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ తీవ్రతతో

హైదరాబాద్ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఎండ తీవ్రతతో ఉక్కిరిబిక్కిరి అయిన నగరవాసులు చల్లటి వాతావరణం ఏర్పడడంతో ఉపశమనం పొందారు. ఆగ్నేయ బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం వేగవంతం కావడంతోపాటు ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాల కారణంగా శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 వరకు నగరంలో వర్షం కురిసింది.
గంటపాటు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో ప్రధాన రహదారులపై వరదనీరు ఉప్పొంగింది. ఈదురుగాలులకు చెట్లు విరిగిపోయాయి. దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతం, దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఆంఫాన్ తీవ్ర తుపాను ఉత్తర దిశగా ప్రయాణిస్తుండడంతో ఆదివారం కూడా నగరంలో చల్లటి వాతావరణం ఏర్పడిందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆదివారం నగరంలో 38.2 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు పేర్కొన్నారు.