హైదరాబాద్: కానిస్టేబుల్ రవీంద్ర సస్పెన్షన్
ABN , First Publish Date - 2020-05-18T15:45:10+05:30 IST
హైదరాబాద్: కానిస్టేబుల్ రవీంద్ర సస్పెన్షన్

హైదరాబాద్: మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తి వద్ద డబ్బులు వసూలు చేశాడనే ఆరోపణలతో పేట్‌బషీర్‌బాద్ పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న రవీంద్ర అనే కానిస్టేబుల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పెట్రోల్ మొబైల్ 1లో విధులు నిర్వహిస్తున్న రవీంద్ర... మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ వ్యక్తిని విచారించడానికి వెళ్లి వారి వద్ద రూ. 500 డిమాండ్ చేశాడని, బాధితుల నుండి రూ.300 గూగుల్ పే ద్వారా జమ చేయించుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు కానిస్టేబుల్ రవీంద్రను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.