బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2020-09-17T16:11:35+05:30 IST

బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు.

బీజేపీ ఆఫీసులో తెలంగాణ విమోచన దినోత్సవం

హైదరాబాద్: బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, బంగారు శృతి, ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ... జిల్లాల్లో బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎంఎంఐకు భయపడే ప్రభుత్వం విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించట్లేదని ఆరోపించారు. అధికారికంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించే వరకు బీజేపీ పోరాటం ఆగదని రామచంద్రరావు స్పష్టం చేశారు. 


మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ....ఈరోజు తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అని తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం దారుణమని మండిపడ్డారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలన్న బీజేపీ డిమాండ్ వెనుక ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. నిజం నుండి తెలంగాణ స్వేచ్ఛ వాయువు పిలిచిన ఈరోజు కాబట్టే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలనేది తమ డిమాండ్ అని అన్నారు. భారతదేశంలో హైదరాబాద్ విలీనం కాకుంటే ఒస్మానిస్తాన్‌గా మారేదని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. 

Updated Date - 2020-09-17T16:11:35+05:30 IST